పారిశుద్ధ పనుల పరిశీలన..

సమస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ ; ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని రెండవ వార్డులో పారిశుద్ధ పనులను సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు కొనసాగుతుందని ప్రజల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తుందని ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.
