నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : మంజీరా నది ఉధృతంగా ప్రవహించడం.. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ పోటెత్తడంతో నాగిరెడ్డిపేట మండల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా వరి పంట ముంపునకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్‌డీఓ పార్థ సింహారెడ్డి ఈ రోజు ముంపు ప్రాంతాలను పర్యటించారు. తాండూర్, వెంకంపల్లి గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంట వివరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆర్డీఓ సంహారెడ్డి తెలిపారు.
ముంపు ప్రాంతాల పరిశీలన !
