- రికార్డులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఏపీ ఎస్‌బీసీఎల్, ఐ ఎం ఎఫ్ ఎల్ డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్… డిపోలో ఉన్న ఐ ఎం ఎఫ్ ఎల్, బీర్ స్టాక్ ప్లాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చెక్ చేశారు. డిపో లో ఉన్న రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు.
అలాగే డిపో సేల్స్, ఏపీ సురక్ష యాప్, గురించి డిపో మేనేజర్ నాగేష్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపో పరిసరాలను కలియ తిరిగి ఐ ఎం ఎల్, బీర్ లోడింగ్ అన్ లోడింగ్ కేసులకు సంబంధించి అక్కడి సిబ్బందికి పలు అంశాలు తెలియజేసి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

