INS VaghSheer Sortie :  నయా నారీ  హిస్టరీ  AndhraPrabha News

INS VaghSheer Sortie :  నయా నారీ  హిస్టరీ  AndhraPrabha News

సబ్​ మెరైన్​ లో రాష్ట్రపతి  సాహస యాత్ర

జలంతర్గామి  ఐఎన్​ ఎస్​ వాఘ్​ షీర్​ సాగర యానం

( ఆంధ్రప్రభ, బెంగళూరు)

INS VaghSheer Sortie

స్వదేశీ పరిజ్ఞానంతో భారత దేశం  నిర్మించిన ఫ్రంట్‌ లైన్ జలాంతర్గామి INS  Vaghsheer) వాఘ్​ షీర్‌లో  (Sortie)  సార్టీని సర్వ సైన్యాధిపతి  ద్రౌపది ముర్ము (Droupadi Murmu)  ఆదివారం భారత నావికాదళ (Naval Hystory)  చరిత్రలోనే  ఒక అద్భుత  అధ్యాయాన్ని జోడించారు. భారత నావికాదళం   కల్వరి  తరగతి (Klavari Class)  నౌకాదళంలోని  ఈ జలాంతర్గామి (Submarine)   పశ్చిమ సముద్ర తీరంలోని కార్వార్ నావల్ బేస్ నుంచి  బయలుదేరింది, సముద్ర గర్భంలో వాఘషీర్​    శక్తి సామర్థాలను రాష్ట్రపతికి  ప్రత్యక్షంగా పరిశీలించారు.

INS VaghSheer Sortie

INS VaghSheer Sortie

ఇది రాష్ట్రపతి  ముర్ము   తొలి  జలాంతర్గామి సార్టీ,    సాగర గర్భంలో  మిషన్‌ను  ప్రత్యక్షంగా అనుభవించిన భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా  ఆమె చరిత్ర సృష్టించారు.  దివంగత డాక్టర్ 2006లో జలాంతర్గామి సార్టీని అప్పటి రాష్ట్రపతి ఏపీజే  అబ్దుల్ కలాం (Apj Abdul Kalam)   ప్రారంభించి నయా చరిత్ర సృష్టించారు.  రాష్ట్రపతి ముర్ము సాహస యాత్రను రాష్ట్రపతి భవన్  వివరించింది.  “రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్‌లో భారత నావికాదళం   స్వదేశీ కల్వరి తరగతి జలాంతర్గామి INS వాఘ్​ షీర్‌ను అధిరోహంచారు.

INS VaghSheer Sortie

 పశ్చిమ సముద్ర (Weast Sea coast)  తీరంలో రాష్ట్రపతి విహార యాత్ర చేస్తున్నారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్‌తో  నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి (Admiral Dineh Tripathi)   ఉన్నారు.”

INS VaghSheer Sortie

ఈ మిషన్‌కు ముందు రాష్టపతి ముర్ము  నావికా యూనిఫాం ధరించి, జలాంతర్గామిలోకి ప్రవేశించే ముందు నావికా సిబ్బంది నుంచి  హృదయపూర్వక వందనం స్వీకరించారు. భారతదేశ విస్తృత సముద్ర వ్యూహాత్మక చట్రంలో సార్టీ   ప్రాముఖ్యతను   నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి వివరించారు.  INS వాఘ్​ షీర్ భారతదేశం  ప్రాజెక్ట్ -75 స్కార్పీన్ కార్యక్రమంలో  ఈ ఏడాది ప్రారంభంలో  సేవలు ప్రారంభించింది.   ఇది సిరీస్‌లో ఆరవ   చివరి జలాంతర్గామి, ఇది ఉభయ చర   జలాంతర్గామి.    యుద్ధ తంత్ర విన్యాశంలో దిట్ట.  శత్రువులపై   నిఘా   సహా బహుముఖ ప్రజ్ఞాశాలి.

Leave a Reply