రిజర్వేషన్ల అమలులో అన్యాయం
బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందే
మంత్రి కొండా సురేఖ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 18(ఆంధ్రప్రభ) : రిజర్వేషన్ల అమలులో బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. ‘బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (బీసీ జేఏసీ) రాష్ట్ర బంద్ లో భాగంగా శనివారం కంటోన్మెమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రేథిఫైల్ బస్టాండ్ వద్ద జరిగిన బీసీ ధర్నాలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొని, ప్రసంగించారు. రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదనవ్యక్తం చేశారు.
ఇందులో డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీకి బీసీలు మనుషులుగా కనిపించడం లేదా అని నిలదీశారు. బీసీల పాపం బీజేపీకి తగులుందని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్‌కు క్రెడిట్ దక్కుతుందని అనుకుంటే అది మీరే తీసుకోండి అని సూచించారు. రాష్ట్ర గవర్నర్ ఒక్క సంతకం పెట్టి… బీసీ బిల్లుకి ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా సమస్య వచ్చేది కాదన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీసీలందరూ ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.