మరో మహిళకు గాయాలు.. కేసు నమోదు.

మరో మహిళకు గాయాలు.. కేసు నమోదు.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : అదుపుతప్పి ట్రాక్టర్ ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి చెందగా మరో మహిళకు కాలు విరిగిన సంఘటన నారాయణపేట(Narayanapet) జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి గ్రామంలో ఈ రోజు చోటుచేసుకుంది. ఎస్సై రమేష్ కథనం ప్రకారం… మండల పరిధిలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన సదువు కృష్ణారెడ్డి(Saduvu Krishna Reddy) ఇంటికి పెరుగు తీసుకువెళ్లేందుకు బీబక్ అనంతమ్మ(Beebak Anantham)(75) అనే వృద్ధురాలు వచ్చి పెరుగు తీసుకొని తిరిగి వెళ్లే స‌మ‌యంలో మంజులతో మాట్లాడుతుండగా సదువు కృష్ణారెడ్డి మేనల్లుడు ఆంజనేయులు పొలానికి వెళ్లేందుకు ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు.

ట్రాక్ట‌ర్ వేగంగా వచ్చి ఇంటి ముందు కూర్చున్న అనంతమ్మ, మంజులను ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన బీబక్ అనంతమ్మ, మంజులను నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బలమైన గాయాలైన అనంతమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మంజులకు కాలు విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటనపై మృతురాలు అనంతమ్మ మేనల్లుడు బిబాక్ రామకృష్ణారెడ్డి(Bibak Ramakrishna Reddy) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సైవివరించారు.

Leave a Reply