Indrakiladri | శ‌ర వేగంగా దుర్గ‌మ్మ‌ ఆలయ అభివృద్ధి పనులు…. ఈవో శినా నాయక్

ఎన్టీఆర్ బ్యూరో . ఆంధ్రప్రభ, – కనకదుర్గమ్మ ఆలయంలో అభివృద్ధి పనులన్నీ శ‌రవేగంగా జరుగుతున్నాయని, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిపుణుల సూచనలకు అనుగుణంగా జరుగుతున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ వికే శీనా నాయక్ తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయం మహా మండపం 6వ అంతస్తులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం శీఘ్రంగా కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా జరుగుతున్న పలు పనులు వేగవంతం చేశామన్నారు. అన్నదాన భవనం లడ్డు తయారీ భవనం దసరా నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే పూర్తయిన రాతియాగశాల పూజ మండపాలు ఈ శ్రావణమాసంలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పాడు.

శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నవగ్రహ మండప కొన ప్రతిష్టా కార్యక్రమం జూన్ 3,4,5 తేదీలలో వైదిక కమిటీ సూచనలు మేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజురోజుకి భక్తుల రద్ద పెరుగుతున్న పరిస్థితుల్లో రద్దీకి అనుగుణంగా భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్న ఆయన, ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై వాహనాల రాకపోకలు నిలుపుదల కోసం కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం బస్టాండ్ రైల్వే స్టేషన్ పున్నమిగట్ల నుండి ప్రత్యేక బస్సులను కొండపైకి ఏర్పాటు చేశామన్న ఆయన వీటి ద్వారా కాస్త ట్రాఫిక్ పరిస్థితి పరిష్కారం కాగలదన్నారు. సొంత వాహనాల మీద వచ్చేవారు సీతమ్మ వారి పాదాల ప్రాంతంలో పార్కింగ్ కోసం నాలుగు ఎకరాల్లో హోల్డింగ్ ఏరియాను సిద్ధం చేస్తున్నామని చెప్పిన ఆయన అవసరమైతే కుమ్మరిపాలెం సెంటర్లోని టీటీడీ స్థలంలో కూడా హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేసి, అక్కడి నుండి కొండ ప్రాంతానికి భక్తులను తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గా ఘాట్ ను మరింత విస్తరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో చర్చించామన్న ఆయన త్వరలోనే విస్తరణ చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే ప్రసాద్ పథకం నిధుల కోసం దేవాదయ శాఖ మంత్రి, ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి లో విశేషంగా కృషి చేస్తున్నారని, అతి త్వరలోనే ఢిల్లీ నుండి మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉందన్నారు.

వి ఐ పి దర్శనాల క్రమబద్ధీకరణ..

అమ్మవారి దర్శనానికి వచ్చే వీఐపీలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రోటోకాల్ దర్శనం కోసం రావాలని కార్యనిర్వహణ అధికారి వీకే సేనా నాయక్ సూచించారు. ప్రతిరోజు అమ్మవారికి నైవేద్య విరామం కోసం ఉదయం 11:30 నుండి 1:30 నిమిషాల వరకు విఐపి ప్రోటోకాల్ దర్శనాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ప్రోటోకాల్ కోసం కొద్దిసేపు క్యూ లైన్ లో నలుపుదల చేయడంతో వృద్ధులు వికలాంగులు పసిపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తన స్వయంగా చూశానని, అందుకే ప్రోటోకాల్ దర్శనాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు.

అమ్మవారి దర్శనం కోసే విఐపి ఇలా సమాచార సేకరణ కోసం అన్ని వివరాలతో కూడిన ఫార్మేట్ ను రూపొందించడం జరిగిందని, వీటిలో విఐపి లు వారి పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులకు సిబ్బందికి తప్పనిసరిగా తెలియచేయాలని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఈ ఈ కోటేశ్వరరావు, ప్రధానాలయ ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply