Indrakeeladri | జగన్మాతకు పూజలు

Indrakeeladri | జగన్మాతకు పూజలు
- కనకదుర్గమ్మను దర్శించుకున్నగణపతి సచ్చిదానంద స్వామి
- ఘనంగా స్వాగతం పలికిన ఈఓ చైర్మన్
Indrakeeladri | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు ఈ రోజు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన స్వామివారికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అమ్మవారి మూలవిరాట్ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామివారికి వేదాశీర్వచనం చేయగా ఈఓ, చైర్మన్లు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి దర్శనంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
