ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా నిర్మించాలి….

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా నిర్మించాలి….

బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు సకాలంలో నిర్మించుకోవాలని బిక్కనూర్ మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్(Srinivas) చెప్పారు. ఈ రోజు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో పాటు కమిటీ సభ్యులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు.

ఇట్టి విషయంలో లబ్ధిదారులు నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. డ్వాక్రా సంఘాల(Dwakra Associations) ద్వారా లబ్ధిదారులకు కావలసిన రుణాలు అందించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాజ్ కిరణ్ రెడ్డి(Raj Kiran Reddy), గ్రామ సచివాలయ కార్యదర్శి లక్ష్మీ, గ్రామపంచాయతీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply