తొర్రూరు టౌన్, జూన్ 3(ఆంధ్రప్రభ) : అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతిభవనం ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గ్రామాల వారీగా అర్హులైన వారికి అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ… గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో పట్టించుకోలేదన్నారు. మన ప్రభుత్వం పేదవారికి సంక్షేమ పథకాలు అందజేస్తుందని, పాలకుర్తి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాయని, వారి గృహ నిర్మాణం చేపట్టినప్పుడు దశల వారీగా డబ్బులు అందజేయడం జరుగుతుందన్నారు. ఇది నిరంతర ప్రక్రయ అని, అర్హులైన పేదవారి పేర్లు ప్రస్తుత జాబితాలో లేకపోతే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి పేదవాళ్లు విచ్చేసి మంజూరు పత్రాలను అందుకున్నారు.