Indira Gandhi | ఘనంగా జయంతి వేడుకలు…
Indira Gandhi | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Ex Prime Minister Indira Gandhi) ఎనలేని కృషి చేశారని, ఆమే సేవలు మరువలేనివని మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య(Palepu Narasayya), కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమే త్యాగాలను స్మరిస్తూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని(Woman Prime Minister)గా బాధ్యతలు చేపట్టి హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై కృషిచేసిన ఉక్కు మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఇందిరా గాంధీ పేద ప్రజలకు అండగా నిలిచిందని, మహిళా సాధికారిత కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆమె పాలనలో బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న(Sunketa Buchanna), తిప్పిరెడ్డీ శ్రీనివాస్, నిమ్మ రాజేంద్రప్రసాద్, తక్కూరీ దేవేందర్, కొమ్ముల రవీందర్, బోనగిరి భాస్కర్, సరసం చిన్నారెడ్డి, బుచ్చి మల్లయ్య, సల్లూరి గణేష్ గౌడ్, అబ్దుల్ అజాహారోద్దీన్, సంపంగి నాగరాజు, అజ్మత్ పాషా, రంజిత్, దులూర్ కిషన్, చంద్రకాంత్ రెడ్డి, పూజారి శేఖర్, వేములవాడ జగదీష్, పడాల గంగాధర్, తక్కురి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

