All England Open | ముగిసిన భార‌త్ పోరాటం !

బర్మింగ్‌హామ్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్స్ 2025 లో భార‌త్ కు నిరాశే మిగిలింది. ఈరోజు (శుక్రవారం) జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భార‌త స్టార్ ప్లేయ‌ర్ లక్ష్య సేన్, మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ – గాయత్రి గోపీచంద్ లు ఓట‌మిపాల‌య్యారు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో భారత్ పోరాటం ముగిసింది.

ఈరోజు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన లి షిఫెంగ్ తో త‌ల‌ప‌డిన‌ లక్ష్య సేన్.. 10-21, 16-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు.

మరోవైపు, మహిళల డబుల్స్‌లో భారత ద్వయం త్రిష జాలీ – గాయత్రి గోపీచంద్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లో టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు.

చైనాకు చెందిన లియు షెంగ్ షు – టాన్ నింగ్ చేతిలో 21-14, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయారు. దీంతో ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో భారత్ సవాలు ముగిసింది.

ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఇప్పటివరకు ఇద్దరు భారతీయులు ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ మాత్రమే ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు.

బాసెల్ వేదిక‌గా స్విస్ ఓపెన్

కాగా, స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదిక‌గా మార్చి 18-23 వ‌ర‌కు స్విస్ ఓపెన్ BWF వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నీ జ‌ర‌గ‌నుంది.

స్విస్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ భారత జట్టు..

ప‌రుషుల సింగిల్స్ : లక్ష్య సేన్, H. S. ప్రణోయ్, ప్రియాంషు రాజావత్, కిరణ్ జార్జ్
మ‌హిళ‌ల సింగిల్స్ : పి.వి. సింధు, మాళవిక బాన్సోద్, అనుపమ, ఆకర్షి కశ్యప్, రక్షిత శ్రీ సంతోష్ రామ్‌రాజ్.
పురుషుల డబుల్స్: సాయి ప్రతీక్.కె – పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, చిరాగ్ శెట్టి – సాత్విక్‌సాయిరాజ్, హరిహరన్ అంశకరుణన్ –
రూబన్ కుమార్ రేతీనాసబాపతి.
మహిళల డబుల్స్: ట్రీసా జాలీ -గాయత్రి గోపీచంద్, శృతి మిశ్రా – ప్రియ కొంజెంబం, వర్షిణి విశ్వనాథ్ శ్రీ -ఆరతి సారా సునీల్
మిక్స్‌డ్ డబుల్స్: సతీష్ కుమార్ కరుణాకరన్ – ఆద్య వరియాత్, అషిత్ సూర్య – అమృత ప్రముతేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *