Indian Political Drama | 2025 హైలెట్స్ ఇవే !!

Indian Political Drama | 2025 హైలెట్స్ ఇవే !!
ఆంధ్రప్రభ : రాజకీయంగా ఈ ఏడాది మన నాయకులు ఫుల్ బిజీబిజీ గా గడిపారు. నిరంతర ఎన్నిక ర్యాలీలు, హోరాహోరీ విమర్శలు, వ్యూహ-ప్రతివ్యూహాలతో రాజకీయ క్షేత్రం ఎప్పుడూ వేడిగానే కనిపించింది. ఒకవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగుతుంటే, మరోవైపు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతూ పార్టీలన్నీ తమ బలాబలాలను పరీక్షించుకున్నాయి. ఈ ఏడాది జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగించగా, ప్రాంతీయ స్థాయిలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంటూ పుంజుకుంది.
ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీలో ఒక దశాబ్దానికి పైగా సాగిన కేజ్రీవాల్ యుగానికి తెరపడటం, బీహార్‌లో ఎన్‌డీఏ ప్రభంజనం సృష్టించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు, తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల నుండి స్థానిక సంస్థల వరకు క్లీన్ స్వీప్ చేసి… తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
దేశవ్యాప్తంగా అగ్రనేతలు గల్లీ స్థాయి ప్రచారాల్లో స్వయంగా పాల్గొనడం ఈ ఏడాది ప్రత్యేకత. అభివృద్ధి మంత్రం కంటే విమర్శలు, ప్రతివిమర్శలు, ఎత్తుకు పై ఎత్తులే ఎన్నికల వ్యూహాల్లో ప్రధాన పాత్ర పోషించాయి..
QuantumTalkByCBN | ఇక క్వాంటం విప్లవం
హీటెక్కిన తెలంగాణ…
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఒక కీలక మలుపుగా నిలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచారు.

సుమారు 1.4 లక్షల ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నికలకు కొద్దిరోజుల ముందే మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కేబినెట్‌లోకి తీసుకోవడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. అజారుద్దీన్ స్వయంగా రంగంలోకి దిగి మైనారిటీ ప్రాంతాల్లో పర్యటించడం.., అలాగే, గతంలో బీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉన్న ఎంఐఎం పార్టీ ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.
మరోవైపు, బీఆర్ఎస్ తరపున కేటీఆర్ స్వయంగా ప్రచారంలోకి దిగి.. సానుభూతి పవనాలను వాడుకోవాలని ప్రయత్నించారని విమర్శలు వచ్చాయి.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని ‘ఎన్నికల గిమ్మిక్కు’గా పేర్కొన్న బీఆర్ఎస్, ప్రధానంగా హైడ్రా (HYDRAA) చర్యలపై విమర్శలు గుప్పించింది. హైడ్రా బాధితులను ఆదుకుంటామని హామీ ఇస్తూ.. ఎన్నికల ప్రచారం చేసింది.
అయితే, నవీన్ యాదవ్‌కు ఉన్న బలమైన బీసీ ఓటు బ్యాంక్, మైనారిటీల మద్దతు కాంగ్రెస్ విజయానికి బాటలు వేశాయి. మరోవైపు బీజేపీ సైతం కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి అగ్రనేతలను రంగంలోకి దించినప్పటికీ, ఉప ఎన్నిక పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే కేంద్రీకృతమైంది.
రేవంత్ రెడ్డికి మిడ్ టర్మ్ అప్రూవల్..
జుబ్లీహిల్స్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన సత్తా చాటి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ‘మిడ్-టర్మ్’ అప్రూవల్ సంపాదించుకుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెలను రాజకీయ రణరంగంగా మార్చాయి. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ తన పట్టున్న ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన 10 రోజుల జిల్లాల పర్యటన పరోక్షంగా ఈ ఎన్నికల ప్రచారానికి భారీగా కలిసివచ్చింది. ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల విజయాలను ఆయన నేరుగా పల్లె ఓటర్లకు వివరించారు. వికారాబాద్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ద్వారా ప్రభుత్వంపై ప్రజాదరణ తగ్గలేదని స్పష్టమైంది.
ప్రచారాల హోరు
2025లో కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా, తెలంగాణ నేతలు జాతీయ స్థాయిలో కూడా సందడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్ర మంత్రులు ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకున్నారు.
అదేవిధంగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు. అటు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉత్తరాది రాష్ట్రాల్లో మోదీ అభివృద్ధి మంత్రంతో భారీ సభలు నిర్వహించారు. ఈ ఏడాది పొడవునా అగ్ర పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో బిజీబిజీగా గడుపుతూ, ప్రజలను మెప్పించడానికి భారీ హామీలతో హడావుడి చేశారు.
2025 Rewind | Fatal year | తొక్కిసలాటల్లో..
జాతీయ ఎన్నికల సమరం..
ఇదిలా ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది భారత రాజకీయాల్లో అతిపెద్ద సంచలనాన్ని సృష్టించాయి. గత పదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఈసారి బీజేపీ ధాటికి తలొంచింది. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాలను గెలుచుకుని, సుమారు 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఒక చారిత్రక పరిణామం.
కాగా, నవంబర్ 2025లో జరిగిన బీహార్ ఎన్నికల్లో నితీష్-మోదీ జోడీ ప్రభంజనం సృష్టించింది. ఎన్‌డీఏ కూటమి 243 స్థానాలకు గానూ 202 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇదే ఎన్నికల్లో యంగెస్ట్ ఎమ్మెల్యే గా మైథిలీ ఠాకూర్ రికార్డ్ సృష్టించింది. బిజెపి అభ్యర్థి మైథిలి ఠాకూర్ అలీనగర్‌లో ఆర్జేడీ సీనియర్ నాయకుడు బినోద్ మిశ్రాను ఓడించి భారీ విజయం సాధించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 9న జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జగదీప్ ధంఖర్ రాజీనామా అనంతరం ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరిగిన ఈ పోరులో ఎన్‌డీఏ , విపక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు ఎన్‌డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ భారీ విజయం సాధించి భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
అదే సమయంలో ఏప్రిల్ – అక్టోబర్ నెలల్లో అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల నుండి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాజ్యసభ ఎన్నికల ద్వారా ఎన్‌డీఏ కూటమి తన సంఖ్యాబలాన్ని గణనీయంగా పెంచుకోగా, తమిళనాడులో డిఎంకె (DMK), జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. రాజ్యసభలో మారుతున్న ఈ బలాబలాలు జాతీయ రాజకీయాల్లో కీలక బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం చేశాయి.
కర్ణాటక కుర్చీలాట..
ఎన్నికల సందడి ఒక వైపుంటే.. మరోవైపు పలు పార్టీల్లో అంతర్గత కలహాలు సైతం ఈ ఏడాది హాట్ కటాపిక్ గా మారియి. అందలో కర్ణాటక రాష్ట్రంలో అధికారం కోసం అంతర్గత కుర్చీలాటతో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న ఈ ఆధిపత్య పోరు కాంగ్రెస్ హైకమాండ్‌కు అగ్నిపరీక్షగా మారింది.

2023 ఎన్నికల ఫలితాల అనంతరం, అధిష్టానం సమక్షంలో కుదిరిన రహస్య ఒప్పందం ఈ వివాదానికి కారణమైంది. ఆ ఒప్పందం ప్రకారం తొలి రెండున్నర ఏళ్లు సిద్ధరామయ్య పాలన సాగించాలని, అనంతరం డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించాలని ఫార్ములా ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. 2025 నవంబర్ నాటికి ఈ గడువు సమీపించడంతో, పీఠాన్ని దక్కించుకోవడానికి డీకే వర్గం అధిష్టానంపై ఒత్తిడి చేయగా, సిద్ధరామయ్య మాత్రం ససేమిరా అనడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.
డిసెంబర్ 2025లో బెల్గాం (బెళగావి) లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ వివాదానికి వేదికగా నిలిచాయి. డిసెంబర్ 19న అసెంబ్లీ వేదికగా సిద్ధరామయ్య తాను పూర్తి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, హైకమాండ్ తనపై అచంచలమైన విశ్వాసంతో ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. అసలు డీకే శివకుమార్‌తో ఎలాంటి “పవర్ షేరింగ్” ఒప్పందం లేదని ఆయన బహిరంగంగా తిరస్కరించారు. ప్రస్తుతం సమస్య సద్దుమనిగి.. సిద్ధరామయ్య- డీకే శివకుమార్ పైకి.. ఐక్యంగా కనిపిస్తున్నప్పటికీ, అధికారం కోసం సాగుతున్న ఈ పోరాటం కర్ణాటక రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చింది.
Political Drama , Political Drama , Political Drama , Political Drama , Political Drama , Political Drama , Political Drama , Political Drama ,
