Best Companies | పని ప్రదేశాల్లో.. భారత్ టాప్

Best Companies | పని ప్రదేశాల్లో.. భారత్ టాప్

Best Companies, న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ పని ప్రదేశాల జాబితాను ఫార్చ్యూన్ మీడియా, (Fortune Media) గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థలు విడుదల చేశాయి. ఇందులో 25 కంపెనీలకు స్థానం దక్కింది. వీటిలో 16 కంపెనీల్లో భారత్ (Bharath) కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2024 – 2025 సంవత్సరాల్లో ఈ రెండు సంస్థలు సర్వే నిర్వహించాయి. మొత్తం 90 లక్షలు మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. దాదాపు 2.5 కోట్ల మంది ఉద్యోగులు ఆయా సంస్థల్లో పని చేస్తున్నారు. కనీసం 5 వేల మంది పని చేసే సంస్థలు, కంపెనీలను మాత్రమే ఈ జాబితాలో చేర్చారు.

కంపెనీల పై ఉద్యోగుల నమ్మకం, అనుకూల పని పరిస్థితులు, వివిధ దేశాల్లో శాఖలు వంటి అంశాలను సర్వేలో పరిగణలోకి తీసుకున్నారు. ఆయా సంస్థలు ప్రాంతీయంగా కూడా మంచి పని వాతావరణం ఉన్న ప్రదేశాల జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో హాస్పటాలిటీ, టెక్నాలజీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, మానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన 25 కంపెనీలు (25 Companies) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. హిల్డన్, డీహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్, సిస్కో, యాక్సించర్, మారియట్ ఇంటర్నేషన్, అబ్ ఈ, టీపీ, స్ట్రెక్టర్, సేల్స్ ఫోర్స్, మెట్ లైఫ్, సర్వీస్ నౌ, స్పెక్ సేవర్స్, సీమెన్స్, హెల్త్ నీర్స్, ఎక్స్ పీరియన్, ఎన్విడియా, కేడన్స్, అలియాంజ్, డౌ, వయాట్రిస్, క్రౌడ్ స్ట్రైక్, ట్రెక్ బైస్కిల్, అడ్మిరల్ గ్రూపు వంటి గ్రూపులు కాకుండా మిగిలనవన్నీ భారత్ లో (Bharath) కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Leave a Reply