WORLD CUP | మళ్లీ దాయాదుల పోరు

2026 టీ20 వరల్డ్ కప్‌లో ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్
WORLD CUP | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వచ్చే ఏడాది ప్రారంభమయ్యే 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరు చూసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న భారత్‌తో పాటు పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ గ్రూపులో భారత్, పాకిస్థాన్ సులువుగా సూపర్ 8 దశకు చేరుకునే అవకాశం ఉంది. గ్రూప్ దశలో భారత మ్యాచ్‌లు ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. మరోవైపు సహ ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మాత్రం కఠినమైన గ్రూప్ ఎదురైంది. ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్‌లతో కూడిన గ్రూపులో శ్రీలంక తలపడనుంది.
