ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) 2025లో ఇప్పటివరకు జరిగిన మ్యాచులు చాలా చప్పగా సాగాయి. అసలు టోర్నీ జరుగుతుందా లేదా అన్నట్టే ఉంది. ఇక సెప్టెంబర్ 14 వతేదీన (ఆదివారం) అసలు సమరానికి తెర లేవనుంది. మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 8.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత దాయాది దేశాలు తలపడే మొదటి మ్యాచ్ ఇదే. నువ్వానేనా అన్నట్టు ఈ మ్యాచులో తలపడేందుకు భారత్, పాక్ జట్లు సిద్ధమయ్యాయి. టీ20 ఫార్మాట్(T20 format)లో భారత్- పాక్ మొత్తం ఇప్పటిదాకా 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా 10 మ్యాచ్‌ల్లో భారత్ (India) నెగ్గింది. పాక్ మూడు మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. ఈ ఫార్మాట్లో పాకిస్థాన్ (Pakistan)పై భారత్‌దే ఆధిపత్యంగా ఉంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Stadium)లోని మైదానం స్పిన్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు పేస్, బౌన్స్ లభించినా బ్యాటర్లు ఈజీగా పరుగులు సాధించవచ్చు. ఇదే పిచ్‌పై తొలి మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) 4 వికెట్లతో రాణించాడు. దుబాయ్‌లో పొడి వాతావరణం నెలకొంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు.
ఎక్కడ చూడొచ్చంటే..
ఆసియా కప్ టోర్నీని సోనీ స్పోర్ట్స్ (Sony Sports) నెట్వర్క్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే డీడీ స్పోర్ట్స్ (DD Sports) బ్రాడ్కాస్ట్ ఛానెల్స్‌లో ఫ్రీ గా లైవ్ మ్యాచ్ చూడవచ్చు.
తుది జట్లు అంచనా
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి / అర్ష్‌దీప్ సింగ్
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, సల్మాన్ అగా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్

