ఆంధ్రప్రభ వెబ్ డస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trum) విధించిన భారీ సుంకాలు(Tariffs) నేపథ్యంలో అమెరికా(America)కు ఇండియా(India)కు సత్సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారత్ తో మాకు ఉండే అవసరం చాలా తక్కువ.. మాతో భారత్ కు ఉండే అవసరం చాలా ఎక్కువ అని ట్రంప్(Trum) సంచలన వాఖ్యలు చేశారు. భారత్ దేశం మాతో ఎక్కువగా వ్యాపారం(Business) చేస్తుందన్నారు.

భారత్ కొన్ని సంవత్సరాలుగా అమెరికాను తన పెద్ద కస్టమర్ గా భావించిందని.. కానీ ప్రతిగా అమెరికా(America)కు భారత్ లో వ్యాపారం(Business) చేసేందుకు చాలా తక్కువ అవకాశం ఉందని చెప్పారు. భారత్ అమెరికాకు భారీ మొత్తంలో వస్తువులను విక్రయిస్తుందని.. అమెరికన్ కంపెనీలు(American companies) అక్కడ చాలా తక్కువ ఉత్పత్తుల(Products)ను విక్రయిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దీనికి భారత్ అధిక సుంకాలను విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు. అమిరికాపై ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా ఒకటని.. అమెరికన్ ఉత్పత్తులు భారత మార్కెట్ ను చేరుకోలేకపోవడానికి ఇదే కారణమని వెల్లడించారు.

Leave a Reply