India | దేశమంతా ఈ -పాస్ పోర్టులు..

India | దేశమంతా ఈ – పాస్ పోర్టులు..

  • ఇప్పటికే 80లక్షల ఈ-పాస్ పోర్టులు జారీ..
  • కొత్త పాస్ పోర్టుల్లో చిప్లు, ఎంబెడెడ్ ఎంబ్లమ్..
  • ఆర్ఎస్ఐడీ చిప్లలో సమస్త సమాచారం..

India, న్యూఢిల్లీ: పాస్ పోర్ట్ భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి, ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి భారత (Bharath) ప్రభుత్వం ఈ-పాస్ పోర్టుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉన్న పాస్ పోర్ట్ నే పోలి ఉండే ఈ కొత్త పాస్ పోర్ట్ చిప్ను కలిగి ఉండి.. ముఖచిత్రం పై అశోక చిహ్నం ఎంబెడెడ్ ముద్రించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2035 కల్లా దేశవ్యాప్తంగా ఈ- పాస్ పోర్ట్ అందించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దీని ద్వారా చెలామణిలో ఉన్న అన్ని భారతీయ పాస్ పోర్టులో చిప్ వేస్తారు. 2025 మే 28న లేదా ఆ తర్వాత కొత్త పాస్ పోర్ట్ జారీ అయిన లేదా పాస్ పోర్ట్ పునరుద్ధరణ జరిగినట్లయితే.. అది ఈ-పాస్పో ర్ట్గా మారుతుంది. ఇప్పటికే ఉన్న నాన్-ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్లు వాటి గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఇలా ఉండగా, 2025 మే నాటికి 80 లక్షలకు పైగా ఈ-పాస్పోర్ట్ ను జారీ చేశారు. ప్రతి ఈ-పాస్ పోర్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఎస్ఐడీ) చిప్, యాంటెన్నా పొందుపరచబడి ఉంటాయి. ఇవి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు అనుగుణంగా డిజిటల్గా సంతకం చేయబడిన ఫార్మాట్లో ఛాయాచిత్రాలు, వేలిముద్రలు వంటి ఎన్క్రిప్టెడ్ బయోమెట్రిక్, వ్యక్తిగత డేటాను సురక్షితంగా నిల్వ చేస్తాయి.

ఈ-పాస్ పోర్ట్ (ePassport) మరింత సురక్షితం. నకిలీ పాస్ పోర్ట్ వాడకాన్ని, పత్రాల దుర్వినియోగాన్ని నిరోధించడమే కాకుండా విమానాశ్రయ ఇమిగ్రేషన్ సమయంలో పట్టే సమయాన్ని కూడా తగ్గిస్తాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ పాస్ పోర్ట్, వీసా విభాగం కార్యదర్శి అరుణ్ కుమార్ ఛటర్జీ మాట్లాడుతూ.. ఈ-పాస్పోర్టు సురక్షితమైనవి, విమానాశ్రయాలలో సమయం ఆదా చేసేవి, హోల్డర్లకు అనుకూలమైనవి, అంతర్జాతీయ విమానా శ్రయాలు ఏర్పాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ-పాస్పోర్ట్ హోల్డర్లు ఇక పై విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో తమ గుర్తింపును ధృవీకరించడానికి సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న టచ్స్కీన్పై పాస్పోర్ట్లోని ఈ-చిప్ను ఉంచడం ద్వారా గేట్ తెరుచుకుంటుంది. ఇంకా, ఇమ్మిగ్రేషన్ అధికారి ఇకపై పాస్ పోర్టుదారుడి ప్రతి వివరాలను ధృవీకరించా ల్సిన అవసరం లేదు. భారతీయ విమానాశ్రయాలలో డీజీ యాత్ర ప్రపంచ వెర్షన్ అయిన విశ్వసనీయ ట్రావెలర్ ప్రోగ్రామ్ కింద ఇది జరుగుతోంది.

80 లక్షల పాస్ పోర్టులు జారీ..
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 80 లక్షల మందికి ఈ పాస్ట్ పోర్ట్ జారీ అయ్యాయి. విదేశాలలో ఉన్న భారత రాయబార కార్యాలయాలు 60,000 ఈ-పాస్పో ర్ట్లను జారీ చేశాయి. దేశంలో పాస్పోర్ట్ ప్రక్రియను సులభతరం చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 511 లోక్సభ నియోజకవర్గాలలో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 32 నియోజకవర్గాలలో కూడా పాస్ పోర్టు ఫె సిలిటేషన్ కేంద్రాలు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://epaper.prabhanews.com

Leave a Reply