India A Squad | ఇంగ్లాండ్ పర్యటనకు భారత్.. !

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనునన్న భారత్ ఏ జట్టును ప్రకటించింది బీసీసీఐ. 20 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇంగ్లండ్ తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2027 సైకిల్ ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ సిరీస్‌లకు సన్నాహకంగా భారత్-ఏ టీమ్.. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడనుంది. మే 30 నుంచి జూన్ 2 మధ్య తొలి అనధికారిక టెస్ట్ జరగనుండగా.. జూన్ 6-25 మధ్య రెండో అనధికారిక మ్యాచ్ జరగనుంది. జూన్ 13-16 మధ్య ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ జరగనుంది.

కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపిక చేసే ఆటగాళ్లందరిని భారత్-ఏ జట్టులో చేర్చారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.

అనధికారిక టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను అభిమన్యు ఈశ్వరన్‌ నడిపించనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.

భారత్-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(కీపర్), మానవ్ సుతార్, తనూష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.

Leave a Reply