దడ పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి తూములదత్తు..

దడ పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి తూములదత్తు..
భైంసా పురపాలక సంఘ ఎన్నికల్లో 23వ వార్డు నుంచి కౌన్సిలర్ గా మొదటిసారి బ్యాట్ గుర్తుతో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి తూమొల్ల దత్తు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. తన తండ్రి స్వర్గీయ ముత్తన్న పేరిట సేవా కార్యక్రమాలు చేస్తూ పట్టణ ప్రజల హృదయాలను చురగున్నారు. హిందూ ఉత్సవాల్లో, రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూనే, యువకులతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి, దత్తు మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వార్డులోని ఓటర్లు భావిస్తున్నారు. తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే రాజకీయాలకతీతంగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు అంకితం అవుతానని ప్రచారంలో దూసుకుపోతున్నారు.
