Lunch Break on the final day at Edgbaston | ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. చివరి రోజు ఉదయం వర్షం ఆటకు కొంత ఆటంకం కలిగించినా, భారత్ దానిని దాటుకుని గేమ్‌పై పూర్తి పట్టు సాధించింది.
ఆకాశ్‌దీప్ అద్భుతమైన స్పెల్‌తో మ్యాచ్‌ను భారతవైపు తిప్పేశాడు. దూకుడుతో బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ ఓవర్‌నైట్ బ్యాటర్లు ఒలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (23)లను వరుసగా ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను భారీ దెబ్బకు గురిచేశాడు.
అనంతరం వాషింగ్టన్ సుందర్ కీలక బ్రేక్‌త్రూ ఇచ్చి, బెన్ స్టోక్స్-జేమీ స్మిత్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. స్టోక్స్ (33) కాస్త నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా, లంచ్‌కి ముందు అతను ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం ఇంగ్లాండ్‌పై మరింత ఒత్తిడిని తెచ్చింది.
ప్రస్తుతం జేమీ స్మిత్ (32)* క్రీజులో ఉన్నాడు, కానీ ఇంగ్లాండ్ 153/6తో ఉన్న సమయంలో విజయం కోసం ఇంకా 485 పరుగులు అవసరం… పైగా నాలుగు వికెట్లే మిగిలి ఉన్నాయి.
ఇక భారత్ విజయానికి కేవలం 4 వికెట్లు మాత్రమే అవసరం. ఇదే జోరుతో కొనసాగితే, ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌ను 1-1తో సమం చేసే అవకాశాన్ని భారత్ ఖచ్చితంగా సాధించగలదు.