IND vs ENG | గిల్ సేన భారీ స్కోరు !

బర్మింగ్‌హామ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ సేన ఇంగ్లాండ్‌పై భారీ స్కోరు నమోదు చేసింది. రెండో రోజు సాయంత్రం సెషన్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్లు కేవలం 30 నిమిషాల్లో భారత్ చివరి మూడు వికెట్లను పడగొట్టినా.. భారత జట్టు ఇప్పటికే 587 పరుగులు రాబట్టింది. ఇది బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ ఎదుర్కొన్న అత్యధిక టోటల్ కావడం విశేషం.

కెప్టెన్ @269

భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా శుభ్‌మన్ గిల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో 269 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

నేటి సెష‌న్ లో గిల్ తో పాటు… జడేజా (89), వాషింగ్ ట‌న్ సుంద‌ర్ (42) అద్భుతంగా రాణించారు. దాంతో భార‌త్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 587/10 గా నిలిచింది.

ఈ ఇన్నింగ్స్ గిల్ కు మాత్రమే కాకుండా భారత జట్టుకు కూడా ఈ టెస్ట్ లో ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని కల్పించింది. భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఇంగ్లాండ్ ను భారత బౌలింగ్ యూనిట్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

Leave a Reply