IND vs ENG 3rd Test | లార్డ్స్ పిచ్ రిపోర్ట్.. బ్యాటింగ్‌కు కష్టమేనా?

భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ (IND vs ENG Test Series) రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్‌మెన్‌లదే పైచేయిగా నిలిచింది. ఇరు జట్ల బ్యాటర్లు భారీగా పరుగులు సాధించగా, పలువురు ఆటగాళ్లు సెంచరీలు, అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఇక రెండు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి.

ఈ నేపథ్యంలో, సిరీస్‌లో కీలకమైన మూడో టెస్ట్ చారిత్రాత్మక లార్డ్స్ (IND vs ENG 3rd Test) మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లార్డ్స్ పిచ్ ఎలా ఉండబోతోంది, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లు తమ మ్యాజిక్‌తో మ్యాచ్‌ను శాసిస్తారా అనే విషయాలపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

లార్డ్స్ పిచ్ విశ్లేషణ:

మూడో టెస్ట్ కోసం లార్డ్స్ పిచ్ సిద్ధంగా ఉంది. ఈ పిచ్‌ను పరిశీలిస్తే, దానిపై గ‌డ్డి ఎక్కువగా కనిపిస్తోంది. లార్డ్స్ మైదానంలో పిచ్‌పై గ‌డ్డి ఉండటం వల్ల పేస్ బౌలర్లకు చక్కటి స్వింగ్ లభిస్తుంది. అంతేకాకుండా, పిచ్‌పై గ‌డ్డి ఉండటం వల్ల బంతి అసాధారణంగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల కారణంగా, తొలిత బ్యాటింగ్ చేసే జట్లకు ఇది కొంత సవాలుగా మారవచ్చు. బంతి విపరీతమైన బౌన్స్, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

అయితే, మ్యాచ్ సాగే కొద్దీ, పిచ్ పాతబడిన తర్వాత బ్యాటింగ్ చేయడం సులభం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 310 పరుగులుగా నమోదవుతోంది. లార్డ్స్ చరిత్రను పరిశీలిస్తే, ఇక్కడ 344 పరుగులకు మించి లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, మూడో టెస్టులో టాస్ గెలిచిన జట్టుకు పిచ్ అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply