ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న తొలి సెమీస్ లో.. ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా ముందు సేన ముందు 265 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
కాగా, భారీ ఛేదనలో కోహ్లీతో (51) కలిసి కీలక భాగస్వామ్య నెలకొల్పిన శ్రేయస్ అయ్యర్ (45) తృటి లో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 26.2వ ఓవర్లో జంపా వేసిన బంతికి శ్రేయస్ పెవిలియన్ చేరాడు. అయితే, శ్రేయస్ అయ్యార్ – విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్ కు 111 బంతుల్లో 91 పరుగులు సాధించారు.
కాగా, భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్లో శుభమన్ గిల్ (8), 8వ ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (28) తొలి రెండు వికెట్లుగా వెనుదిరిగారు.
ప్రస్తుతం ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (52) – అక్షర్ ఉన్నారు. 27 ఓవర్లకు టీమిండియా స్కోర్ 137/3