GOLD| బంగారంపై బండపడ..

బంగారంపై బండపడ..
ఒక్క రోజులోనే రూ.5వేలు పెరుగుదల
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,954
కిలో వెండి ధర కూడా రూ.3.25 లక్షలకు పెరిగి సరికొత్త గరిష్ఠానికి
GOLD| వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : పసిడి ధర మళ్లీ పరుగు పెడుతోంది. బంగారం ధరలు ధగధగ మండుతున్నాయి. గోల్డ్ ధరల మోత మోగుతుండటంతో విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. బంగారం షాపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రోజురోజుకూ రేట్లు పైపైకి పోయి కొండెక్కి కూర్చుంటున్నాయి. గోల్డ్ రేట్లు ఇప్పట్లో శుక్రవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.5,000 పెరిగి సరికొత్త ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరింది. కొద్దిరోజులుగా కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన పసిడి, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మళ్లీ సురక్షిత పెట్టుబడిగా మారి, ధరలు ఆకాశాన్నంటాయి. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించి కొత్త శిఖరాలను తాకింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి, 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గురువారంతో పోలిస్తే రూ.5,000 పెరిగి రూ.1,59,954కి చేరింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులం రూ.1,41,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.3.25 లక్షల వద్ద ట్రేడవుతోంది.
