Nalgonda | ఆటో బోల్తా పడి..

Nalgonda | ఆటో బోల్తా పడి..
ఒకరు మృతి
Nalgonda | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా (Nalgonda district) చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ఒక ఆటో (auto) ఫల్టీ కొట్టి పిల్లాయిపల్లి కాలువలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిట్యాల మండలం పెరపెల్లి గ్రామానికి చెందిన అంతటి రవి వృత్తిరీత్యా ఆటో (auto) డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ అదే క్రమంలో శనివారం ఉదయం చిట్యాల నుండి వెలిమినేడు వైపుగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండడంతో ఈ ప్రమాదం జరిగింది. మార్గమధ్యంలో పెద్ద కాపర్తి శివారులోని రహదారి ప్రక్కన ప్రమాదవశాత్తు పిల్లాయిపల్లి కాలువలో ప్యాసింజర్ ఆటో అదుపు తప్పి పడిపోవడంతో డ్రైవర్ అంతటి రవి (Driver Anthati Ravi) (36) నీటిలో మునిగి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు పూర్తిగా తెలియవలసి ఉంది.
