క‌మ‌లం పార్టీలో…

క‌మ‌లం పార్టీలో…

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సినీనటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి(Dr. Ramani) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandra Rao) ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ.. తమ కుటుంబానికి హిందుత్వం అంటే ఎంతో ఇష్టం అని, అందుకే బీజేపీ(BJP)లో చేరామని తెలిపారు. సమాజ సేవ చేయాలనే ఆసక్తి తమకుందని, బీజేపీలో చేరడం ద్వారా ప్రజలకు సేవ చేయగలుగుతానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే, బలమైన రాజకీయ పార్టీ(political party) అయిన బీజేపీలో పనిచేయడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ(party)లో చేరడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply