పవిత్రమైన కార్తీక మాసంలో..
దేవరకొండ, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ): దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఎంతో పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు నడిపిస్తున్నట్లు ఇన్చార్జి డిపో మేనేజర్ పడాల సైదులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అమరావతి (అమరలింగేశ్వర స్వామి దేవాలయం), భీమవరం (సోమేశ్వర స్వామి దేవాలయం), పాలకొల్లు (క్షీర లింగేశ్వర స్వామి దేవాలయం) ద్రాక్షారామం( భీమేశ్వర స్వామి దేవాలయం), సామర్లకోట ( భీమలింగేశ్వర స్వామి దేవాలయం) లను ఒకే రోజు దర్శించుకునే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ప్రత్యేకంగా కల్పించడం జరిగిందన్నారు. పెద్దలకు రూ.2200, పిల్లలకు రూ.1400 చార్జీలు వర్తిస్తాయని తెలిపారు. ఈనెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించి పరమ శివుని ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే తెలంగాణలోనిపుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు కూడా ప్రత్యేకంగా భక్తుల కోరిక మేరకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. బుకింగ్ కోసం 9949026631, 9848847419,9666599890, 9441340163నంబర్ లను సంప్రదించాలని ఆయన కోరారు.

