WGL | ధరణిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి : ట్యాంక్ ఎక్కి రైతుల నిరసన
కేసముద్రం, ఫిబ్రవరి 03(ఆంధ్రప్రభ ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం – నారాయణపురం రైతులకు ఎంజాయిమెంట్ సర్వే ప్రకారం ‘ధరణి’లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలంటూ సోమవారం కేసముద్రం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రైతులు నిరసన తెలిపారు.
నారాయణపురం రైతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణపురం గ్రామంలో 60ఏళ్లుగా సాగుచేస్తున్న వ్యవసాయ భూములను కొత్త రెవెన్యూ గ్రామంగా 31, మేలో కేసముద్రం మండలం 2018లో ఏర్పడిన సమయంలో భూ రికార్డుల ప్రక్షాళనలో 43 సర్వే నెంబరులో మొత్తం 1827 ఎకరాలుండగా, అందులో 222 ఎకరాలు పట్టా భూమినీ, 1605 ఎకరాల భూమి రిజర్వు ఫారెస్ట్ గా పేర్కొంటూ అప్పటి రైతుల పట్టాలను రద్దు చేశారు. 2021 ఫిబ్రవరి 9న అటవీశాఖ తమ భూములకు క్లియరెన్స్ ఇచ్చారు. 2021, జూన్ లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సర్వే నెంబర్లు 145 నుండి 185 వరకు ఉన్న 1639 ఎకరా భూముల్లో ఎంజాయిమెంట్ ‘ధరణి’లో చేర్చాలని సీసీఎల్ఎకు లేఖలు రాసినప్పటికీ స్పందించకపోతే నారాయణపురం రైతులందరూ 13, సర్వేను నిర్వహించగా 9, జూన్, 2021- 18, ఆగస్టు, 2021 జిల్లా కలెక్టరు నారాయణపురాన్ని ఏప్రిల్, 2022న ధరణిలో తమ గ్రామాన్ని చేర్చాలని నిరవదిక రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు.
మిగిలిన సుమారు 1000 ఎకరాల్లోని 700మంది రైతులకు ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు రావాల్సిఉంది.
ఇటీవలే రాష్ట్ర సచివాలయం ముట్టడికి నారాయణపురం రైతులు వెళ్లగా, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించి రైతు పేరు, తండ్రి పేరు అడవి గా నమోదు చేసిన వివరాలను జీవో నెంబర్ 94ను జారీ చేసి తొలగింపజేశారు. దీంతో శేత్వార్ తగ్గి పట్టాపాస్ పుస్తకాలు జారీ చేసేందుకు అవకాశం ఏర్పడింది.
ఇటీవలె అసెంబ్లీలో నారాయణపురం భూ సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావిస్తూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నప్పటికీ జారీ చేసే అవకాశం ఉన్నప్పటికీ సీసీ ఎల్ద కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఏడు సంవత్సరాలుగా పట్టాపాస్ పుస్తకాలు జారీ చేయడంలో జాప్యం చేయడం వల్ల ఈసారితో కలిపి 12సార్లు రైతుబంధు రూ.15కోట్లు నష్టపోయామన్నారు. ఇప్పటికైనా తమరు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంజాయిమెంట్ సర్వే నివేదిక ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి, రైతుబంధు, రైతు భీమా పథకాలను వర్తింపజేయాలని కోరుతున్నామన్నారు.