లైంగిక‌దాడి కేసు..దోషికి జైలుశిక్ష‌,జ‌రిమానా!!

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : లైంగిక దాడికి పాల్ప‌డిన ఓ వ్య‌క్తికి జీవిత ఖైదు(life imprisonment) విధించడంతోపాటు రూ. 21 వేలు జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు(fast track special court) న్యాయమూర్తి కె. సునీత తీర్పు వెల్లడించారు.

2022 జూన్ రెండో తేదీన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లిలో శీలారపు రమేష్ (38) అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి పోత్కపల్లి ఎస్సై లక్ష్మణ్(SI Laxman) కేసు నమోదు చేశారు.

సాక్ష్యాధారాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి కె.సునీత దోషికి జీవిత ఖైదుతోపాటు, బాధితురాలికి పునరావాసం కింద రూ. 5 ల‌క్ష‌లు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసిన అప్పటి ఏసీపీ సారంగపాణి(ACP Sarangapani), ఎస్సై లక్ష్మణ్‌తో సాక్ష్యాధారాల‌ను పక్కాగా కోర్టు(Court)లో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షపడేలా చేసిన ఏసీపీ కృష్ణ, పోత్కపల్లి ఎస్సై రమేష్, సీఎంఎస్‌(CMS) ఇంచార్జ్ కోటేశ్వరరావు, సీడీపీఓ శ్రీనివాస్‌ల‌(CDPO Srinivas)కు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదాం రమేష్ వాదించారు.

Leave a Reply