TG | సిగాచి ఫార్మా ప్రమాదం.. అధికారుల కీల‌క నిర్ణ‌యం

  • ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలకు త‌క్ష‌న‌ పరిహారం

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో జూన్ 30న జరిగిన సిగాచి ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికులు మృతి చెందినట్లు భావిస్తూ, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. ప్రమాద ప్రాంతంలో గల్లంతైన వారి అవశేషాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడ్డ 34 మంది కార్మికుల్లో 14 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంకా కొంతమంది కార్మికులు పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

Leave a Reply