IMAX | పూడూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

IMAX | పూడూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

  • సర్పంచ్ అభ్యర్థి తాజుద్దీన్

IMAX | పూడూర్, ఆంధ్ర‌ప్ర‌భ : పూడూర్ మండల కేంద్రంలో గల టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాజుద్దీన్ అవకాశమిస్తే మండల కేంద్రాన్ని నియోజకవర్గం(Constituency)లోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

పూడూరు స్టేజి నుండి గ్రామం వరకు డబుల్ రోడ్డు(Double Road) విస్తరణ పనుల కోసం కృషి చేస్తానన్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తానన్నారు.

అలాగే పూడూరు గ్రామానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(underground drainage)ని నిర్మిస్తానని, మైసమ్మ గడ్డ తండాలో అంగన్వాడీ బిల్డింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామంలోని వీధిలైట్లు అన్ని వేస్తానని, చౌరస్తాల వద్ద ఐమాక్స్(IMAX) లైట్లు ఏర్పాటు చేస్తానన్నారు.

ముఖ్యంగా గ్రామంలో 200 ఎకరాలకు పైగా త్రిబుల్ఆర్ రోడ్ వెళుతుంద‌ని.. కావున రైతులకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు భూమికి భూమి ఇచ్చే విధంగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. గత పది సంవత్సరాలుగా గ్రామంలో ఎంపీటీసీగా సేవలందించిన తనని సర్పంచిగా గెలిపించాలని అభ్యర్థించారు.

Leave a Reply