రూ.24,503 విలువచేసే అక్రమ కలప, కోత మిషన్లు స్వాధీనం

రూ.24,503ల అక్రమ కలప, కోత మిషన్లు స్వాధీనం

జన్నారం, ఆంధ్రప్రభ : అటవీ శాఖ అధికారులు మంచిర్యాల జిల్లా(Manchryala District) జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామంలో ఈ రోజు ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అక్రమ టేకు కలపను, కోత మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలోని పాలాజి సుధాకర్, పాలాజి భాస్కర్ ల ఇండ్లలో తమ అటవీ శాఖ ఆధ్వర్యంలో దాడిచేసి రూ.24,503 విలువచేసే అక్రమ కలప, రెండు కోత మిషన్లను స్వాధీనం చేసుకున్నట్లు తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి. సుష్మారావు(V. Sushma Rao) తెలిపారు. ఆ నిందితులపై కేసు నమోదు చేసి, మిషన్లను సీజ్ చేసి, కలపతో పాటు రేంజ్ కు తరలించామన్నారు.

ఈ దాడిలో ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్(Indanapalli Forest Range) ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు సాగరిక, పోచమల్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు శంకర్, నరేష్, రవికుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రైమోద్దీన్, సాయి, రవికిరణ్, అనిత, జ్యోతి, కృష్ణమూర్తి, రుబీనా, గుమ్ముల వెంకటేష్, లవన్ కుమార్, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply