MBNR | యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

మద్దూరు, ఏప్రిల్ 5(ఆంధ్రప్రభ ): మండలంలోని పలు గ్రామాల్లో ప‌గ‌లు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జ‌రుగుతోంది. కొత్తపల్లి మండల పరిధిలోని భూనీడ్, దుపట్టి గట్టు, నిడ్జింత గ్రామాల శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.

సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply