చిట్కుల్ లో ఐలమ్మ వర్ధంతి వేడుకలు…

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ (Chakali Ilamma) అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu Mudhiraj) అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో ఉన్న ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెల కట్టలేనిదన్నారు.

బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందూకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని చిట్కుల్ గ్రామం (Chitkul village) లో ప్రతిష్టించామని నీలం మధు ముదిరాజ్ గుర్తు చేశారు.

చాకలి ఐలమ్మ స్పూర్తితో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ హక్కులు, ఉద్యోగ అవకాశాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం (Public government) రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గాను తెలంగాణ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది అని అన్నారు నీలం మధు ముదిరాజ్.

ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి వెంకటేష్, సత్తయ్య, బాబు, కిషోర్, రజక సోదరులు, మాజీ ఫాఛ్శ్ చైర్మన్ నారాయణ రెడ్డి, ఆంజనేయులు, అశోక్, లింగం, లక్ష్మణ్, ప్రవీణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply