మత్తు వదలకపోతే..

మత్తు వదలకపోతే..

కరీమాబాద్, ఆంధ్రప్రభ – పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన యువకుడి పై కేసు నమోదు చేశామని మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ తెలిపారు. ఎస్సై లావుడియా నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున జన్మభూమి జంక్షన్లో కానిస్టేబుల్ సయ్యద్ పాషా, కే సురేష్ యాదవ్, డ్రైవర్ ఎండి సులేమాన్ ల తో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి అనుమానస్పదంగా వస్తుండగా అతనిని ఆపి నీవు ఎవరు..? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు..? అని ప్రశ్నించారు.

ఆ సమయంలో ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని.. ఎస్ఐ ని మీరు ఏం చేసుకుంటారు.. చేసుకోండి అని గొడవపడ్డాడట. డ్రైవర్ ఎండి సులేమాన్ నేట్టేయడంతో పాటు ఎస్సై చేతిలో ఉన్న పోలీస్ లాఠీని లాక్కొని ఎస్సైని కూడా నెట్టివేశాడని ఎస్ఐ నరేష్ ఫిర్యాదు అందజేశారని తెలిపారు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Leave a Reply