TG | అలా చేస్తే సహించేది లేదు..

TG | అలా చేస్తే సహించేది లేదు..

వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి

TG | రామన్నపేట, ఆంధ్రప్రభ : అక్రమంగా ధాన్యమును మిల్లుకు తరలించిన వ్యక్తులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి అధికారులను కోరారు. శనివారం మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో వారు విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం నాడు రామన్నపేట మండలంలోని తుమ్మల గూడెం పిఎసిఎస్ సెంటర్లోని ధాన్యాన్ని పిఎసిఎస్ సెంటర్ మార్కెట్ ఇన్చార్జిగా ఉన్న వ్యక్తిని స్థానిక బిఆర్ఎస్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి (VidyaSagar Reddy) బెదిరించి ధాన్యాన్ని సీరియల్ లేకుండా తరలించారు. మందడి సాగర్ రెడ్డి తనఇంటి దగ్గర ధాన్యం పోసుకొని బినామీ పేరు మీద ధాన్యాన్ని లారీలో లోడ్ చేసి స్థానిక రైస్ మిల్లుకు పంపించడం జరిగింది. దీంతో స్థానిక రైతులు గుర్తించి సంబంధిత అధికారులకు పిఏ సిఎస్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత అధికారులు స్థానిక రైతులు పై బిఆర్ఎస్ నాయకులు మాకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Former Minister Jagadish Reddy) మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండదండలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతూ గ్రామంలో కరెంటును కూడా బంద్ చేయించి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం జరిగిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన మాదిరిగా చేస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సహించదని అన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, పున్న రమేష్, పున్న జగన్మోహన్,పూస బాలకిషన్, గోదాసు పృథ్వీరాజ్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, ఎండి రెహాన్, గుత్తా నర్సిరెడ్డి, మేడి రవి, పెద్దగోని వెంకటేశం,పిట్ట వెంకట్ రెడ్డి, రామిని రమేష్, జెల్ల వెంకటేష్,బొడ్డు సురేందర్రావు, ఎండి జమీరుద్దీన్, బత్తుల నవీన్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply