SUBSIDIE | రైతు బాగుంటే..

SUBSIDIE | రైతు బాగుంటే..


SUBSIDIE | కర్నూలు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైతు బాగుంటే.. రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుంటుందని దేశానికి రైతు వెన్నెముక అని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నేడు కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నెలో గ్రామంలో.. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో అన్నదాతలతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం (GOVT) రైతుల కోసం చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రణాళికలు మంత్రి వివరించారు.

రైతులు వ్యవసాయంలో పాటించాల్సిన మెలకువలు, ఆధునిక వ్యవసాయ విధానాలు అందిపుచ్చుకోవడం వంటి అంశాల పై రైతులతో మంత్రి చర్చించారు. అన్నదాతలు ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు (Subsidies) అందిపుచ్చుకోవడంతో పాటు, నూతన వ్యవసాయ విధానాలు అవలంబించడం ద్వారా మంచి దిగుబడి సాధించగలరని పేర్కొన్నారు. కేవలం మూస ధోరణిలో పంటలు వేయకుండా.. కాలానుగుణంగా డిమాండ్ ఆధారిత ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. తమకున్న వ్యవసాయ భూముల్లో ఒకే పంటను కాకుండా.. వేరువేరు పంటలు సాగు చేయడం ద్వారా లాభ పడతారని, రైతులంతా ఒకే పంటను సాగు చేస్తే దిగుబడి పెరిగినప్పటికీ.. మార్కెట్లో పంటకు డిమాండ్ తగ్గి.. అంతిమంగా ధర తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

సీమలో సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు ఆధునిక వ్యవసాయ విధానాలైన డ్రిప్, స్ప్లింకర్లను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరిందించే విధంగా సాగునీటి ప్రాజెక్టులు (Project) పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, అందుకే రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు, పనిముట్లు అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 2 విడతలగా రైతుల ఖాతాల్లో రూ. 14 వేలు జమ చేసామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Leave a Reply