Wyra | అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవు : ఏసీపీ రహెమాన్

సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రహెమాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ, కుల, మత, ప్రాంతీయ వివాదాలకు తావు ఇచ్చేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Whats App, Facebook, Twitter, Instagram వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించే విధంగా, ఏదైనా వర్గాన్ని కించపరిచేలా తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం నేరంగా పరిగణించబడుతుందన్నారు. ఒక గ్రూపులో ఇలాంటి పోస్టులు షేర్ అయితే, ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యుడిగా పరిగణించబడతారని తెలిపారు.

ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. అనుచిత పోస్టులను ఫార్వర్డ్ చేసిన వారిపైనా కేసులు నమోదు చేయబడతాయని పెర్కొన్నారు. కాబట్టి సామాజిక మాధ్యమాలను సమాజానికి మంచిని చేకూర్చేవిధంగా మాత్రమే ఉపయోగించుకోవాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *