Icon Star | బన్నీ మరో రెండు సినిమాలు ఓకే చేశాడా..?

Icon Star | బన్నీ మరో రెండు సినిమాలు ఓకే చేశాడా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే.. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో మూవీని అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశాడు. అయితే.. ఇప్పుడు మరో రెండు సినిమాలను లాక్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ విపిస్తోంది. ఇంతకీ.. బన్నీ లాక్ చేసిన ఆ రెండు ప్రాజెక్టులు ఏంటి..?

Icon Star

అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న మూవీ పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని 2026 ఎండింగ్ లో లేదా 2027 బిగినింగ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత లోకేష్‌ కనకరాజ్ తో సినిమా చేయనున్నట్టుగా ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాను ఈ ఇయర్ లోనే సెట్స్ పైకి తీసుకువస్తామని కూడా ప్రకటించారు. ఆగష్టులో ఈ మూవీ పట్టాలెక్కచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇది సూపర్ హీరో కథతో రూపొందుతోన్న డిఫరెంట్ మూవీ అని కూడా వార్తలు వస్తున్నాయి.

Icon Star

ఇదిలా ఉంటే.. బన్నీ లాక్ చేసిన మరో రెండు ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప 3. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించే ఈ సినిమాను పుష్ప 2 ఎండింగ్ లో అనౌన్స్ చేశారు. అయితే.. ఉంటుందో ఉండదో అనే అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం స్పెషల్ గా ఆఫీస్ కూడా తీసారని.. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని తెలిసింది. మరి.. మరో ప్రాజెక్ట్ ఏంటంటే.. ఎవరితో అనేది బయటకు రాలేదు కానీ.. ఆ ప్రాజెక్ట్ సర్ ఫ్రైజింగ్ గా ఉంటుందని.. వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బన్నీ నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడుగా..

Icon Star

CLICK HERE TO READ మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply