Icon Star | సందీప్ రెడ్డి సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు..?

Icon Star | సందీప్ రెడ్డి సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ క్రేజీ కాంబోలో మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత అయినా సందీప్ రెడ్డి వంగతో సినిమా ఉంటుంది అనుకుంటే.. కోలీవుడ్ లోనే మరో స్టార్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్ తో సినిమాని అనౌన్స్ చేయడం విశేషం. దీంతో బన్నీ, సందీప్ సినిమా ఏమైంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. బన్నీ, సందీప్ సినిమా ఉందా..? లేదా..?

Icon Star

ఓ వైపు అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ.. మరో వైపు నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాని అనౌన్స్ చేస్తారు అనుకుంటే.. లోకేష్‌ కనకరాజ్ తో సినిమాని అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశారని చెప్పచ్చు. ఈ సినిమా ఈ ఇయర్ లోనే సెట్స్ పైకి వస్తుందని ప్రకటించారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి బన్నీ, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ఏమైంది.. అసలు ఉందా..? లేదా అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. బన్నీ అట్లీతో మూవీ బిజీలో ఉంటే.. మరో వైపు సందీప్ రెడ్డి వంగ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ బిజీలో ఉన్నాడు.

Icon Star

బన్నీ, సందీప్ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ యానిమల్ 2 చేయాలి. ఆతర్వాత బన్నీతో సందీప్ సినిమా ఉంటుందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అంటే.. 2028లో ఈ క్రేజీ కాంబో మూవీ ఉండచ్చు. అయితే.. రణ్‌ బీర్ కపూర్ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉంటే.. యానిమల్ 2 కంటే ముందుగానే బన్నీతో సినిమాని చేసినా చేయచ్చు అని మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి బన్నీ, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు ఏమైంది అనేది సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అయ్యింది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై బన్నీ లేదా సందీప్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Icon Star

CLICK HERE TO READ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్ చేసిన జక్కన్న

CLICK HERE TO READ MORE

Leave a Reply