ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ప్రపంచ కప్ తేదీలు, వేదికలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ 13వ ఎడిషన్ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు భారతదేశం – శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వడం ప్రత్యేకంగా నిలిచింది. టోర్నమెంట్ భారత్‌లో 12 సంవత్సరాల తర్వాత జరుగుతుండటంతో అభిమానుల్లో విశేష ఉత్సాహం నెలకొంది.
సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్ vs శ్రీలంక మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న ఫైనల్ ఫైట్ జరగనుంది.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి – భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. కాగా, ఈ ప్రపంచ కప్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది, మొత్తం 28 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ తర్వాత, టాప్ 4 జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే, ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది.
మహిళల వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్ !
- సెప్టెంబర్ 30 ; భారత్ vs శ్రీలంక – బెంగళూరు (మ. 3:00)
- అక్టోబర్ 1 ; ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – ఇందోర్ (మ. 3:00)
- అక్టోబర్ 2 ; బాంగ్లాదేశ్ vs పాకిస్తాన్ – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 3 ; ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా – బెంగళూరు (మ. 3:00)
- అక్టోబర్ 4 ; ఆస్ట్రేలియా vs శ్రీలంక – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 5 ; భారత్ vs పాకిస్తాన్ – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 6 ; న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా – ఇందోర్ (మ. 3:00)
- అక్టోబర్ 7 ; ఇంగ్లాండ్ vs బాంగ్లాదేశ్ – గౌహతి (మ. 3:00)
- అక్టోబర్ 8 ; ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 9 ; భారత్ vs దక్షిణాఫ్రికా – విశాఖపట్నం (మ. 3:00)
- అక్టోబర్ 10 ; న్యూజిలాండ్ vs బాంగ్లాదేశ్ – విశాఖపట్నం (మ. 3:00)
- అక్టోబర్ 11 ; ఇంగ్లాండ్ vs శ్రీలంక – గౌహతి (మ. 3:00)
- అక్టోబర్ 12 ; భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం (మ. 3:00)
- అక్టోబర్ 13 ; దక్షిణాఫ్రికా vs బాంగ్లాదేశ్ – విశాఖపట్నం (మ. 3:00)
- అక్టోబర్ 14 ; న్యూజిలాండ్ vs శ్రీలంక – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 15 ; ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 16 ; ఆస్ట్రేలియా vs బాంగ్లాదేశ్ – విశాఖపట్నం (మ. 3:00)
- అక్టోబర్ 17 ; దక్షిణాఫ్రికా vs శ్రీలంక – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 18 ; న్యూజిలాండ్ vs పాకిస్తాన్ – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 19 ; భారత్ vs ఇంగ్లాండ్ – ఇందోర్ (మ. 3:00)
- అక్టోబర్ 20 ; శ్రీలంక vs బాంగ్లాదేశ్ – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 21 ; దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 22 ; ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ – ఇందోర్ (మ. 3:00)
- అక్టోబర్ 23 ; భారత్ vs న్యూజిలాండ్ – గౌహతి (మ. 3:00)
- అక్టోబర్ 24 ; పాకిస్తాన్ vs శ్రీలంక – కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 25 ; ఆస్ట్రేలియా vs శ్రీలంక – ఇందోర్ (మ. 3:00)
గ్రూప్ స్టేజ్ చివరి రోజు – రెండు మ్యాచ్‌లు
- అక్టోబర్ 26 ; ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – గౌహతి (ఉ. 11:00)
- అక్టోబర్ 26 ; భారత్ vs బాంగ్లాదేశ్ – బెంగళూరు (మ. 3:00)
నాకౌట్ దశ
- అక్టోబర్ 29 ; సెమీఫైనల్ 1 – గౌహతి / కొలంబో (మ. 3:00)
- అక్టోబర్ 30 ; సెమీఫైనల్ 2 – బెంగళూరు (మ. 3:00)
- నవంబర్ 2 ; ఫైనల్ – కొలంబో / బెంగళూరు (మ. 3:00)
ఇకపోతే, 2025 టోర్నమెంట్‌లో భారత జట్టు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ తో బరిలోకి దిగనుంది. జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన లాంటి స్టార్ ఆటగాళ్లపై భారత జట్టు ఆశలు పెట్టుకుంది. గత టోర్నీలో ఫైనల్ చేరలేకపోయిన భారత్ ఈసారి టైటిల్ గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
