పట్నం చైర్మన్ పీఠం.. టెన్షన్ టెన్షన్..

పట్నం చైర్మన్ పీఠం.. టెన్షన్ టెన్షన్..

మున్సిపల్ కార్యాలయంపై రాళ్లదాడి
అప్రమత్తమైన పోలీసులు


ఇబ్రహీంపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం క్షణం క్షణం ఉత్కంఠ బరితంగా మారింది. ఒకవైపు ఆర్డిఓ అనంతరెడ్డి సమక్షంలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేయనుండగా ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయంపై రాళ్లు వేయడంతో కిటికీలు ధ్వంసమ‌య్యాయి. పోలీసులు చుట్టూ బందోబస్తు మధ్య ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో భయానాక వాతావరణం నెలకొంది.

దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి సమావేశానికి గైర్హాజరు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ భర్త ఆచూకీ తెలపాలంటూ ఆర్డీవోను కోరారు. దీంతో ఎన్నిక వాయిదా వేయాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆర్డీఓ అనంతరెడ్డిని డిమాండ్ చేశారు. అరగంట పాటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply