మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

సూర్యాపేట, ఆంధ్ర‌ప్ర‌భ‌ : తాను దొంగ‌ను కాద‌ని, అయినా ఎస్ఐ క్రాంతి కుమార్ త‌న‌ను పిలిచి దొంగ సొత్తు ఇవ్వాల‌ని వేధింపుల‌కు తాళ‌లేక ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య (committed suicide) చేసుకున్న సంఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలో క‌ల‌క‌లం సృష్టించింది. వెంపటి గ్రామానికి చెందిన రమణబోయిన సోమనర్సమ్మ (45) అనే మహిళ పాలివాళ్ల‌ ఇంట్లో జరిగిన దొంగతనంలో అనుమానితురాలుగా గుర్తించి ఎస్సై క్రాంతి కుమార్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.

పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ తీర్మానం చేసుకునేందుకు పురమాయించారు. పెద్ద మనుషుల ఒత్తిడితో బంగారం వెండి, నగలు ఇచ్చేందుకు ఆమె ఒక తేదీ ఖరారు చేసుకొని అనుకున్న సమయానికి బంగారం ఇవ్వలేదు. అంతేకాకుండా తాను దొంగతనానికి పాల్పడలేదని పోలీసులు, పెద్దమనుషుల ఒత్తిడితోనే ఒప్పుకున్నానని ఎస్ఐ ముందు తన గోడువెల్లబోసుకుంది. అయినా ఎస్ఐ ( SI) తీవ్రమైన ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమ న‌ర్స‌మ్మ‌ ఆత్మహత్యకు కారణ‌మైన ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ అధికారులను కోరుతున్నారు.

Leave a Reply