HYDRAA | బిఫోర్ – ఆఫ్టర్ లా మారిన నగరంలోని నాలాలు

  • నగరంలో పెద్దఎత్తున పూడిక తీత పనులు
  • హైడ్రా రంగంలోకి దిగడంతో మారిన పరిస్థితి
  • ఊపిరి పీల్చుకుంటున్న నగర ప్రజలు

హైడ్రా రంగంలోకి దిగడంతో నాలాల్లో, కల్వర్టుల వద్ద పూడికతీత పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయి. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, DRF బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో కల్వర్టులు క్లియర్ అవుతున్నాయి. లారీలకొద్దీ చెత్తను తొలగించడంతో వరద సాఫీగా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. తొలగించిన చెత్తను వెంటనే ఆ పరిసరాల్లోంచి తరలించడంతో నివాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జూలై 1 వ తేదీ నుంచి మొదలయిన పనులు.

ఈ నెల 1వ తేదీ నుంచి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, హైడ్రా DRF బృందాలు సంయుక్తాద్వర్యంలో ఆపరేషన్ నాలా, కల్వర్టుల క్లీనింగ్ పనులు మొదలయ్యాయి. GHMC పరిధిలో మొత్తం నాళాలను, కల్వర్టులను, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలను ఈ బృందాలు జల్లెడ పట్టాయి. GHMC , జలమండలి సహకారంతో నాలాలు, కల్వర్టుల క్లీనింగ్ పనులను ముమ్మరం చేశాయి.

దీంతో నాలాలు, కల్వర్టులు రూపు రేఖలు మారాయి. నాలాలు, కల్వర్టుల క్లీనింగ్ పనులతో కాలువ పరిసరాల్లో నివాసముంటున్న ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాలువల్లో నీరు సాఫీగా సాగిపోవడాన్ని చూసి హమ్మయ్య అనుకుంటున్నారు.

నాలాల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

నాలాల్లో చెత్తనే కాదు ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించుతోంది. ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ వద్ద బుల్కాపూర్ నాలా ఆక్రమణలను తొలగించింది. కూకట్పల్లి IDL చెరువు నాలా ఆక్రమణలను కూడా తొలగించింది. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద నాలా కల్వర్టులో పెద్దఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను హైడ్రా యుద్ధప్రాతిపదికన తొలగించింది. లాంగ్ ఆర్మ్ JCB తో చెత్తతో పాటు థర్ర్మోకోల్, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి లారీలకు నింపి తరలించింది. యిప్పుడు అక్కడ వరద సాఫీగా సాగడాన్ని చూసి స్థానికులు.. ఇది కదా హైడ్రా అంటే అని కొనియాడుతున్నారు.

Leave a Reply