హైడ్రా కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల (DRF teams) జీతాలు తగ్గించడంపై ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించి హైడ్రా కార్యాయాన్ని (Hydra operation) ముట్టడించారు. పెద్ద సంఖ్యలో సిబ్బంది కార్యాలయం వద్ద చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అక్కడికి పోలీసులు (police) చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు పలు నినాదాలు చేశారు. విధులకు హాజరుకామని స్పష్టంచేశారు. కొన్ని నెలలుగా జీతాలు (salaries) ఆలస్యంగా రావడమే కాకుండా, కొత్తగా తగ్గింపులు అమలు చేయడంతో కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
