ఓటువేసిన‌ హైడ్రా కమిషనర్

ఓటువేసిన‌ హైడ్రా కమిషనర్

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ (Jubilee Hills) శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధుర నగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్ లోని పోలింగ్ బూత్ 132లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు.

ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకోవడం మనంద‌రి బాధ్యత అన్నారు. ఓటు (vote) ను సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేసుకోవద్దని సూచించారు. యువత కూడా ఓటు వేసిన తర్వాత మిగతా పనులు చూడాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.

Leave a Reply