Hyd | వ‌ణికిస్తున్న‌ వాతావ‌ర‌ణం

Hyd | వ‌ణికిస్తున్న‌ వాతావ‌ర‌ణం

  • త‌గ్గిన ఉష్ణోగ్ర‌త్త‌లు.. పెరిగిన చ‌లి

Hyd | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో వాతావ‌ర‌ణం వ‌ణికిస్తోంది. వారం రోజుల కింద‌ట వ‌ర‌కూ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన ప‌లు ప్రాంతాల‌కు చ‌లి పంజా విసురుతోంది. ప్ర‌ధానంగా ఉత్త‌ర భార‌త్(North India) దేశాల్లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త్త‌లు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌మోదు కావడంతో ప్ర‌జ‌లు ఒకింత ఆందోళ‌న‌కు గురువుతున్నారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనూ క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డంతో చ‌లి పెరుగుతోంది. చ‌లి నుంచి ర‌క్ష‌ణ పొందాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ప‌దేళ్ల‌లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డంతో ఇది రెండోసారని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో హైద‌రాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌(Adilabad, Warangal, Khammam, Karimnagar, Mahabub Nagar) వేళల్లో ఉమ్మ‌డి జిల్లాలో రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ‌లో ఏడు నుంచి 15 డిగ్రీల క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఏటా డిసెంబర్ మొదటి వారంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ప‌డిపోయి చ‌లి పెరిగేది. కానీ ఈ ఏడాది న‌వంబ‌ర్ రెండో వారం నుంచి క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి.

తెల‌వారు జామున ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇంటి గడప దాటి బయటకు ఎవ‌రూ రావ‌డం లేదు. అలాగే రాత్రి ఎనిమిది గంట‌ల‌కే ఇంటి ప‌ట్టున చేరుతున్నారు. ముఖ్యంగా పిల్లలు వృద్ధుల పరిస్థితి రోజురోజుకూ దైన్యంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో చ‌లి మంట‌లు కాగుతున్నారు.

తెలంగాణ‌లోని క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు సింగిల్ డిజిట్‌లో చేరుకున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో ఆసిఫాబాద్ జిల్లాలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు చ‌లిగాలుల తీవ్రత పాగమంచు వాతావరణ పరిస్థితుల ఇదేవిధంగా కొనసాగుతాయని, వృద్ధులు, పిల్లలు ఉదయం రాత్రి పూట బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణ‌లో ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, అలాగే ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌లోని అల్లూరి సీతారామారాజు జిల్లా, పార్వ‌తీపురం మ‌న్యం త‌దిత‌ర జిల్లాల మ‌న్యంలో చ‌లి చంపేస్తోంది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ(Utnoor Agency), ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో చలిగాలుల ప్రభావంతో రోజురోజు కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండటం ఆందోళన కలిగి స్తుంది.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఏటూరు నాగారం ఏజెన్సీ, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో భ‌ద్రాద్రి ఏజెన్సీ, అల్లూరి సీతారామారావు జిల్లా అర‌కు, పాడేరు, చింత‌ప‌ల్లి, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో భ‌ద్ర‌గిరి ఏజెన్సీ, సీతంపేట ఏజెన్సీలో చ‌లి తీవ్ర‌త అధికంగా ఉంది. ప‌ర్యాట‌క కేంద్ర‌మైన లంబ‌సింగిలో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు ఏడు డిగ్రీల సెలియ‌స్‌కు చేరుకుంటుంది. ఇక్క‌డ‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కులు మంచును ఆస్వాదిస్తూ తెల్ల‌వారు జామున చ‌లి మంట‌లు కాగుతుంటారు.

తిర్యాణి మండలంలో మంగి గ్రామ విద్యుత్ శాఖ ఫీడర్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న పర్చాకి మారుతి (38) మార్నింగ్ వాక్ చేస్తూనే చలి గాలులతో వణికిపోతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. గుడిహత్నూర్ మండలం డోంగర్ గామ్లో మాజీ ఎంపీటీసీ రౌఫ్ ఖాన్(Ex MPTC Rauf Khan). (70)బుధవారం అర్థరాత్రి చలి గాలులతో వణికి పోతూ ఛాతిలో నొప్పివచ్చి గుండెపోటుతో వేకువ జామున మృతి చెందాడు. అప్ప‌టికి అక్క‌డ‌ 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైన‌ట్లు అధికారులు గుర్తించారు.

Leave a Reply