హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రప్రభ ) : భారతదేశంలో డిజైన్, కళలు, భవిష్యత్తు ఆలోచనలకు ప్రముఖ వేదికగా ప్రసిద్ధి చెందిన డిజైన్ డెమోక్రసీ సెప్టెంబర్ 5–7 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న డిజైన్ డెమోక్రసీలో ప్రదర్శనలు, చర్చలు, ఇన్‌స్టాలేషన్‌లు, క్యూరేటెడ్ అనుభవాల్లో 120కి పైగా ప్రముఖ బ్రాండ్‌లు, 80కు పైగా ప్రభావవంతమైన స్పీకర్లు, 15,000 కు పైగా సందర్శకులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో జైపూర్ రగ్స్, ది చార్ కోల్ ప్రాజెక్ట్, ఫజో ప్రాజెక్ట్, శైలేష్ రాజపుట్ , ఏకెఎఫ్ డి ప్లస్, అనంతయ, వితిన్, రవిష్ వోహ్రా హోమ్స్, ఏక్ కళాకార్, ఏహెచ్ఎం సింగపూర్ వంటివి పాల్గొంటున్నాయి.
ఈసందర్భంగా డిజైన్ డెమోక్రసీ సహ వ్యవస్థాపకురాలు శైలజ పట్వారి మాట్లాడుతూ.. ఆర్థిక, నిర్మాణశైలి పరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ సమకాలీన డిజైన్ ఫోరమ్ కు సరైన వేదికగా నిలుస్తుందన్నారు. అందానికి సంబంధించినంత వరకూ నిశ్శబ్ద భాష డిజైన్. డిజైన్ డెమోక్రసీ అనేది ప్రదర్శనలు, సంభాషణలు, సహకారాల ద్వారా డిజైన్ కమ్యూనిటీతో సన్నిహితంగా ఉండటానికి సృష్టించబడిన వేదిక. ఇది సృష్టికర్తలు, వినియోగదారులు, పెద్ద పర్యావరణ వ్యవస్థ మధ్య సంబంధాలను నిర్మించడం చేస్తోందని సహ వ్యవస్థాపకుడు అండ్ క్యూరేటర్ అర్జున్ రాఠి అన్నారు.
ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా డిజైన్ హౌస్ కు చెందిన సుప్రజ రావు క్యురేట్ చేయగా, మ్యూజియం అఫ్ తెలంగాణ, అబిన్ డిజైన్ స్టూడియోకు చెందిన అబిన్ చౌదరి, స్నేహశ్రీ నంది క్యురేట్ చేసిన గ్యాలరీ అఫ్ సస్టైనబిలిటీ తో పాటుగా ఫాడ్ స్టూడియోకు చెందిన ఫరా అహ్మద్ క్యురేట్ చేసిన ప్రెసియస్ ఆబ్జెక్ట్స్, న్యూడ్స్ నుంచి నురు కరీం క్యురేట్ చేసిన ఫ్లో నిలువనున్నాయన్నారు.