HYD | ఓయో గదిలో విషాద ఘటన

HYD | ఓయో గదిలో విషాద ఘటన
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో పెళ్లి కూతురి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పెళ్లి దుస్తుల్లోనే అతడు హోటల్ గదిలో ఉరివేసుకున్నాడు.
ఏప్రిల్ 3న కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ఓ ఓయో హోటల్ గదిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వనమాల లోకేష్ (29) అనే యువకుడు తన కాబోయే భార్య అంబికతో కలిసి హోటల్‌లో ఉన్నాడు.
ఈ క్రమంలో అంబికను ఆహారం తెమ్మని బయటకు పంపిన లోకేష్, గది తలుపు లోపల నుంచి మూసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొంతసేపటి తరువాత అంబిక తిరిగి వచ్చి చూడగా లోకేష్ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
